ఆదివారం 24 జనవరి 2021
National - Dec 20, 2020 , 12:59:24

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..వీడియో

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..వీడియో

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్ రాష్ట్రం వ‌ల్సాద్ జిల్లాలోని వాపి ఏరియాలో ఈ తెల్ల‌వారుజామున‌ భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్‌లోని స్క్రాప్‌కు మంట‌లు అంటుకుని ఒక్క‌సారిగా ఎగిసిప‌డ్డాయి. ఈ మంట‌ల్లో గోడౌన్‌లోని స్క్రాప్ పూర్తిగా దగ్ద‌మ‌య్యాయి. అంతేగాక ఆ గోడౌన్ చుట్టుప‌క్క‌ల ఉన్న మ‌రికొన్ని గోడౌన్‌ల‌కు కూడా మంట‌లు ఎగ‌బాకాయి. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌ల‌ను ఆర్పేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo