శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 12:37:59

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వీడియో

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వీడియో

ఘ‌జియాబాద్‌: ‌యూపీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఘ‌జియాబాద్ జిల్లా ద‌స్నా ఏరియాలోని పారిశ్రామిక వాడ‌లో శుక్ర‌వారం ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌టనా ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌ల‌ను ఆర్పేశారు. కాగా ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌న్నారు.           


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.