శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 16:33:50

మూడంత‌స్తుల చెక్క భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం

మూడంత‌స్తుల చెక్క భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం

కులు: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. మూడంత‌స్తుల చెక్క భ‌వ‌నంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో పూర్తిగా కాలిపోయింది. కులు జిల్లా బంజ‌ర్ ఏరియాలోని క‌ల్వ‌రి గ్రామంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని కొండ ప్రాంతాల్లోకి నిర్మాణ సామాగ్రిని త‌ర‌లించ‌డం క‌ష్టం కావ‌డంతో‌ ఎక్కువ‌గా చెక్క భ‌వంతులు నిర్మించుకుంటారు. ఇలాంటి భ‌వ‌నాలు అగ్ని ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు మంట‌ల‌ను అదుపుచేయ‌డం క‌ష్టంగా ఉంటుంది. పూర్తిగా చెక్క నిర్మితం కావ‌డంతో భ‌వ‌నం పూర్తిగా ద‌గ్ధ‌మైతే త‌ప్ప మంట‌లు చ‌ల్లార‌వు. 

కాగా, ఇవాళ జ‌రిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి మ‌ర‌ణాలు చోటుచేసుకోలేదు. ఎవ‌రికీ గాయాలు కాలేదు. మంట‌లు చెల‌రేగిన వెంట‌నే గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు బ‌య‌ట‌కు రావ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. స్థానికుల ఇచ్చిన స‌మాచారంతో మంట‌ల‌ను ఆర్పేందుకు ఫైరింజ‌న్ వ‌చ్చినా అప్ప‌టికే భ‌వ‌నం స‌గానికిపైగా కాలిపోయింది.         


logo