మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 16:57:48

బెంగాల్లోని తాప్సియా మురికివాడ‌లో అగ్నిప్ర‌మాదం.. వీడియో

బెంగాల్లోని తాప్సియా మురికివాడ‌లో అగ్నిప్ర‌మాదం.. వీడియో

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని న‌గ‌రం కోల్‌క‌తా శివార్ల‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈస్ట్ కోల్‌క‌తా శివారు ప్రాంత‌మైన తాప్సియాలోని మురికివాడ‌లో మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజ‌న్‌ల‌తో సాయంతో మంట‌ల‌ను ఆర్పుతున్నారు. కాగా, ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డికావాల్సి ఉంద‌న్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.