మంగళవారం 07 జూలై 2020
National - May 26, 2020 , 06:34:09

ఢిల్లీ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో సుమారు వెయ్యి నుంచి 12 వందల ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి ఒంటిగంటకు తుగ్లకాబాద్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని డీసీపీ రాజేంద్ర ప్రసాద్‌ మీనా చెప్పారు. ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదని ఆయన తెలిపారు. 


logo