సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 11:34:16

ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

విశాఖ : ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. ఒడిశాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఘటనాస్థలిలో మావోయిస్టులకు సంబంధించిన కిట్‌ బ్యాగ్స్‌, తుపాకులు, బాంబుల తయారీకి వినియోగించే సామాగ్రితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. 


logo