శుక్రవారం 03 జూలై 2020
National - Jun 22, 2020 , 17:15:40

మంత్రి ఇంటి వద్ద కాల్పులు

మంత్రి ఇంటి వద్ద కాల్పులు

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌ గోపాల్‌గంజ్‌ పరిధి సాగర్‌లోని రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటి వద్ద ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామని, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అమిత్‌ సంగీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక పిస్టోల్‌, 5 లైవ్‌ రౌండ్లు, 2 ఖాళీ గుళికలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


logo