మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 13:14:52

ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం..

ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం..

ముంబై : మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైలో గురువారం అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ముంబై సెంట్ర‌ల్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో.. స‌మీపంలో ఉన్న నివాస స‌ముదాయాల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మాల్‌లోని రెండు, మూడు అంతస్తుల్లో మంట‌లు వ్యాపించాయి. షాపింగ్ కాంప్లెక్స్ ప‌క్క‌నే ఉన్న 55 అంత‌స్తుల భ‌వ‌నంలోని ప్ర‌జ‌లంద‌రూ త‌మ నివాసాల‌ను ఖాళీ చేశారు. ఆ భ‌వ‌నం నుంచి సుమారు 3,500 మంది బ‌య‌ట‌కు వ‌చ్చారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న 24 ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఈ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.