శనివారం 30 మే 2020
National - Mar 29, 2020 , 23:45:39

ష‌హీన్‌బాగ్‌లో అగ్ని ప్ర‌మాదం

ష‌హీన్‌బాగ్‌లో అగ్ని ప్ర‌మాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం రాత్రి ష‌హీన్‌బాగ్ ఏరియాలోని ఒక ఫ‌ర్నిచ‌ర్ దుకాణంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. అగ్నిమాప‌క సిబ్బంది నాలుగు ఫైరింజ‌న్ల‌తో హుటాహుటిన‌ ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. అయితే, ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదు. ఫ‌ర్నీచ‌ర్ దుకాణం య‌జ‌మానికి మాత్రం ఆస్తి న‌ష్టం వాటిల్లింది. కాగా, లాక్‌డౌన్‌వ‌ల్ల ఫ‌ర్నీచ‌ర్ షాప్ మూసి ఉండటంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని, లేదంటే భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగేద‌ని అధికారులు తెలిపారు.     logo