శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 13:29:08

గుజ‌రాత్ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం..వీడియో

గుజ‌రాత్ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం..వీడియో

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వ‌ల్సాద్ ఏరియాలోని ఓ ప్లాస్టిక్ ఉత్ప‌త్తుల కంపెనీలో ఉన్న‌ట్టుండి అగ్ని కీల‌లు ఎగిసిప‌డ్డాయి. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌ల‌ను ఆర్పుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో ఎవ‌రైనా ఉన్నారా, ఎవ‌రైనా మంట‌ల్లో చిక్కుకున్నారా అనే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త‌లేదు. ప్ర‌మాదానికి కార‌ణం ఏమై ఉండ‌వ‌చ్చు అనే వివ‌రాలు కూడా ఇంకా తెలియ‌రాలేదు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.