గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 17:40:26

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఒంగోలు పట్టణంలోని పెర్నమిట్ట ఏరియాలోగల మినోఫార్మ్‌ ల్యాబోరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో విద్యుత్‌ షార్ట్‌ సర్యూట్‌ కారణంగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని ఒంగోలు పోలీసులు తెలిపారు. ఫార్మా కంపెనీలోని ఒక ఏసీ పనిచేయకపోవడంతో శుక్రవారం ఉదయం మెకానిక్‌ వచ్చి రిపేర్‌ చేశారని, అనంతరం స్విచ్‌ ఆన్‌ చేయగానే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఆ ఫార్మా కంపెనీలో శానిటైజర్లను తయారు చేశారని, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కాగానే శానిటైజర్లకు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చెప్పారు. 


logo