శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 12:11:38

శానిటైజర్ల తయారీ.. ఎగిసిపడ్డ అగ్నికీలలు

శానిటైజర్ల తయారీ.. ఎగిసిపడ్డ అగ్నికీలలు

ప్రకాశం : ఒంగోలులోని పేర్నమిట్ట వద్ద ఉన్న మినోఫామ్‌ ఔషధ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. శానిటైజర్లు తయారు చేస్తుండగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ పరిశ్రమలోని రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దీంతో ఆ పరిశ్రమ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. శానిటైజర్‌లో ఉపయోగించే ఆల్కహాల్‌.. అక్కడున్న జనరేటర్‌పై పడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 


logo