శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 02, 2021 , 14:56:35

పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ పోస్ట‌ర్‌..

పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ పోస్ట‌ర్‌..

మొహాలీ: పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌ను చంపిన వారికి ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు ఇస్తామ‌ని మొహాలీ వీధుల్లో  ఓ పోస్ట‌ర్ పెట్టారు. ఆ పోస్ట‌ర్‌ను ఎవ‌రు అంటించారో తెలియ‌దు. కానీ గుర్తితెలియ‌ని వ్య‌క్తుల‌పై మొహాలీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. న‌గ‌రంలో ఉన్న ఓ గైడ్ మ్యాప్‌పై పోస్ట‌ర్‌ను అంటించార‌ని సిటీ ఎస్పీ తెలిపారు.  గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌పై ఐపీసీలోని 504, 506, 120బీ సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేశారు.  పంజాబ్ డిఫేస్‌మెంట్ ప్రాప‌ర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997లోని 3,4,5 సెక్ష‌న్ల కింద కూడా కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని, నిందితున్ని త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌న్నారు.  సీసీటీవీ ఫూటేజ్‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.