బుధవారం 27 మే 2020
National - May 21, 2020 , 12:57:49

సోనియా గాంధీపై క‌ర్నాట‌క‌లో ఎఫ్ఐఆర్‌

సోనియా గాంధీపై క‌ర్నాట‌క‌లో ఎఫ్ఐఆర్‌


హైద‌రాబాద్‌: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై క‌ర్నాట‌క‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది.  శివ‌మొగ్గ‌లో కేసు రిజిస్ట‌ర్ చేశారు.  పీఎం కేర్స్ ఫండ్‌పై మే 11వ తేదీన‌.. కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. సోనియా గాంధీ ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచి ఆ కామెంట్ల వ‌చ్చిన‌ట్లు తేలింది. దీంతో సోనియాపై క‌ర్నాట‌క‌లో కేసు న‌మోదు చేశారు. అడ్వ‌కేటు ప్ర‌వీణ్ కేవీ ఎఫ్ఐఆర్ రిజిస్ట‌ర్‌ చేశారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ఫ్రాడ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన‌ట్లు అడ్వ‌కేట్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ప్ర‌జ‌ల‌కు వినియోగించ‌డం లేద‌ని, ఆ సొమ్ముతో ప్ర‌ధాని విదేశీ టూర్ల‌కు వెళ్ల‌నున్న‌ట్లు ఆరోపించార‌న్నారు. కోవిడ్‌19 క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వంపై పుకార్లు పుట్టించార‌ని, అందుకే సోనియాపై కేసు బుక్ చేసిన‌ట్లు తెలిపారు.logo