మంగళవారం 14 జూలై 2020
National - Jun 07, 2020 , 09:41:09

కోటి రూపాయల టీచర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కోటి రూపాయల టీచర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఉత్తరప్రదేశ్‌ : నకిలీ పత్రాలతో 25 పాఠశాలల్లో టీచర్‌గా పనిచేస్తున్నట్లుగా సృష్టించి ఏడాది కాలంలో జీతంగా రూ. 1 కోటి ఎత్తుకున్న ఉత్తరప్రదేశ్‌ ఉపాధ్యాయురాలిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బాగ్‌పాట్‌, అలీఘర్‌, అమేథీ, షహరన్‌పూర్‌, అంబేద్కర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఉపాధ్యాయురాలిగా నియమితులైంది. ఫిర్యాదును అనుసరించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ అతుల్‌ శర్మ తెలిపారు. విద్యాశాఖాధికారి అంజలీ అగర్వాల్‌ మాట్లాడుతూ... టీచర్‌ అనామిక శుక్లా 25 స్కూళ్లలో పనిచేస్తున్నట్లు సృష్టించి గత 13 నెలలుగా జీతం విత్‌డ్రా చేసిందన్నారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆమె ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లను గుర్తించిన వెంటనే ఆమెకు నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. రాజీనామా సమర్పించేందుకు కార్యాలయానికి రాగా పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి సతీశ్‌ ద్వివేది మాట్లాడుతూ... ఘటన గురించి మీడియా ద్వారా సమాచారం తెలిసిందని దర్యాప్తు చేయాల్సిందిగా విచారణ కమిటీని ఆదేశించినట్లు పేర్కొన్నారు.


logo