శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 11:42:38

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏ ఒక్కరూ కూడా రహదారులపై రావొద్దని, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్రం ఆదేశించింది. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలను పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాన్‌ కుమార్‌ ఉల్లంఘించారు. మార్చి 31 వరకు పుదుచ్చేరిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం వి. నారాయణస్వామి ప్రకటించారు. ఈ రెండు నిబంధనలను ఎమ్మెల్యే ఉల్లంఘించి తన ఇంటి వద్దకు సుమారు 200 మందికి పైగా పిలిపించుకుని వారందరికి కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మంచి పని చేసినప్పటికీ.. ప్రజల మధ్య దూరాన్ని ఉంచడంలో విఫలమయ్యారు. మొత్తానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటే నమోదైంది.


logo