శుక్రవారం 05 జూన్ 2020
National - May 14, 2020 , 16:04:00

బ‌క్స‌ర్ ఎమ్మెల్యే కేసు..ఏడుగురిపై ఎఫ్ఐఆర్

బ‌క్స‌ర్ ఎమ్మెల్యే కేసు..ఏడుగురిపై ఎఫ్ఐఆర్

బీహార్: లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో బ‌క్స‌ర్ ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి కారులో పోలీసులు వేకువ‌జామున మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై బీహార్ ఏడీజీ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ..మ‌ద్యం బాటిళ్లు సీజ్ చేసిన ఘ‌ట‌న‌లో ఏడుగురిపై కేసు న‌మోదు చేశాం. కారులో న‌లుగురుండ‌గా వారిని అరెస్ట్ చేశాం. కారు య‌జ‌మానితోపాటు మ‌రో ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. 

ఈ విష‌య‌మై ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి ఉద‌యం మాట్లాడుతూ..రేష‌న్ స‌రుకులు పంపిణీ చేసేందుకు నా కారును ఉప‌యోగించారు. బుధ‌వారం జ‌గ‌దీష్ పూర్ లో రేష‌న్ పంపిణీ కోసం నా కారు వెళ్లింది. అయితే నా కారు సిమ్రీకి ఎలా వెళ్లిందో తెలియ‌దు. రేష‌న్ పంపిణీ చేసేందుకు వెళ్లిన వారితో తాను ఇప్ప‌టివ‌ర‌కు  మాట్లాడ‌లేదని మీడియాతో వెల్ల‌డించారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo