గురువారం 26 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 13:57:57

అక్క‌డ మాస్క్ ధ‌రించ‌కుంటే జేబుల‌కు చిల్లే!

అక్క‌డ మాస్క్ ధ‌రించ‌కుంటే జేబుల‌కు చిల్లే!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్నా ప్ర‌జ‌లు ఏ మాత్రం లెక్క‌చేయకుండా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఢిల్లీ-నోయిడా స‌రిహ‌ద్దుల్లో అధికారులు క‌ఠిన నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చారు. మాస్కు లేకుండా క‌నిపించిన వారికి రూ.2000 చొప్పున జ‌రిమానా విధిస్తున్నారు. బ‌స్సులు, కార్లు, ఆటోలు, ద్విచ‌క్ర వాహ‌నాలు ఇలా వాహ‌నం ఏదైనా అందులోని ప్ర‌యాణికుడికి మాస్క్ లేదంటే రూ.2000 చొప్పున వ‌సూలు చేస్తున్నారు. 

మాస్కులు లేని వారికి రూ.2000 చొప్పున జ‌రిమానా విధించాలంటూ ఉన్న‌తాధికారుల నుంచి త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు అందాయ‌ని, అందుకే తాము ఆ నిబంధ‌న‌ను అమ‌లు చేస్తున్నామ‌ని ఢిల్లీ-నోయిడా స‌రిహ‌ద్దుల్లోని పోలీసులు చెప్పారు. చ‌లానా త‌క్కుగా ఉంటే ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకే రూ.2000కు పెంచార‌ని వారు పేర్కొన్నారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.