సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 12:52:48

ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్‌ కేంద్రాలకు ఆర్థిక సాయం

 ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్‌ కేంద్రాలకు ఆర్థిక సాయం

ఢిల్లీ :క్రీడా మంత్రిత్వ శాఖ, దేశంలోని ఆరు కేంద్రాలను ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ కేంద్రాలు (కె.ఐ.ఎస్.సి.ఈ.లు) గా ఆమోదించింది. వాటికి 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేండ్ల కాలంలో  రూ.67.32 కోట్ల కేటాయించింది. ఈ నిధుల ద్వారా క్రీడాకారులను గుర్తించి వారిని ఒలింపిక్ స్థాయి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దనున్నారు. క్రీడా శాఖల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ "దేశవ్యాప్తంగా క్రీడా నైపుణ్యంతో కూడిన కేంద్రాలను అభివృద్ధి చేయడం, 2028 ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశాన్ని మొదటి 10 స్థానాల్లో ఒకటిగా మార్చాలనే ఆశయానికి ఒక ముందడుగు.  ప్రపంచ స్థాయి ప్రత్యేక శిక్షణ సమకూర్చితే తప్ప, మన అథ్లెట్లు ఒలింపిక్స్‌లో రాణిస్తారని మనం ఊహించలేము.  ఈ కేంద్రాలలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట క్రీడా విభాగంలో ప్రపంచ స్థాయి శిక్షణను అందిస్తుంది. ఆ క్రీడలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఉన్నత శిక్షణ పొందుతారు, అప్పుడు దేశంలో ఆ శిక్షణ ఒక  ప్రధాన సదుపాయంగా మారుతుంది.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి రాష్ట్రం ఎంతో సానుకూలత , ఉత్సాహంతో మద్దతు ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది." అని ఆయన పేర్కొన్నారు. 

ఏ కేంద్రానికి ఎంత...?  

అస్సాం :  రాష్ట్ర క్రీడా అకాడమీ, సరుజజై -  7.96 కోట్ల రూపాయలు. 

మేఘాలయ : జె.ఎన్.ఎస్. కాంప్లెక్స్, షిల్లాంగ్, మేఘాలయ - 8.39 కోట్ల రూపాయలు.

డామన్-డియు : న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిల్వాస్సా - 8.05 కోట్ల రూపాయలు. 

మధ్యప్రదేశ్ : ఎం.పి. రాష్ట్ర అకాడమీ - 19 కోట్ల రూపాయలు. 

మహారాష్ట్ర : శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బాలేవాడి, పూణే - 6 కోట్ల రూపాయలు. 

సిక్కిం : పాల్జోర్ స్టేడియం, గ్యాంగ్‌టాక్ - 7.91 కోట్ల రూపాయలు.జోబైడెన్ ముందున్న చాలెంజెస్...ఇవే..!