సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 13:03:54

నిర్మలా సీతారామన్‌ ఏం ప్రకటించబోతున్నారు?

నిర్మలా సీతారామన్‌ ఏం ప్రకటించబోతున్నారు?

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మీడియా సమావేశంపై అందరికి ఆసక్తి నెలకొంది. ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందని, త్వరలోనే ప్యాకేజీ వివరాలను ప్రకటించనున్నామని ఆమె ఇప్పటికే ప్రకటించడంతో.. ఏం చెప్పబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే పలు విషయాల్లో కేంద్రం నిబంధనలను సడలించింది. నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నేపథ్యంలో మార్కెట్లు దృఢంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్లకు పైగా ఎగిసి 30 వేల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 400 పాయింట్లు పుంజుకుని 8700 స్థాయిని దాటి ట్రేడ్‌ అవుతోంది.

మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటించిన ముఖ్యాంశాలు..

  • 2018-19 ఐటీ రిటర్నుల దాఖలు గడువు మార్చి 31 నుంచి జూన్‌ 30కి పెంపు
  • జూన్‌లోగా చెల్లిస్తే వివాద్‌ సే విశ్వాస్‌ పథకంలో 10 శాతం అదనపు చెల్లింపులుండవ్‌
  • అడ్వాన్స్‌ ట్యాక్స్‌, టీడీఎస్‌, తదితర చెల్లింపుల ఆలస్యంపై 9 శాతానికి తగ్గిన వడ్డీరేటు
  • వడ్డీలు, జరిమానాలు, ఆలస్య రుసుములు లేవు
  • 5 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న సంస్థలు జూన్‌ ఆఖరు వారంలోగా రిటర్న్స్‌ దాఖలు చేసుకోవచ్చు
  • 15 రోజులు ఆలస్యమైనా 9 శాతం వడ్డీరేటే (ప్రస్తుతం 18 శాతం)
  • సబ్‌కా విశ్వాస్‌ పథకం కింద చెల్లింపుల తేదీని మార్చి నుంచి జూన్‌కు పొడిగింపు
  • ట్రేడ్‌ ఫైనాన్స్‌ కస్టమర్ల కోసం డిజిటల్‌ ట్రేడ్‌ లావాదేవీల కోసం బ్యాంక్‌ చార్జీల తగ్గింపు
  • దివాలా కేసు కనిష్ఠ పరిమితి కోటి రూపాయలకు పెంపు


logo