శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 14:00:10

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు జూన్‌ 30 గడువు

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు జూన్‌ 30 గడువు

  • ఆధార్‌ - పాన్‌ అనుసంధానం గడువు కూడా జూన్‌ 30 వరకు
  • జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్‌ 30 వరకు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవు అని స్పష్టం చేశారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు 2020, జూన్‌ 30 వరకు గడువు విధించినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆధార్‌ - పాన్‌ అనుసంధానం గడువును కూడా జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9 శాతానికి తగ్గించారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువు జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగించారు. మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్‌ 30 వరకు పొడిగించారు. కాంపొజిషన్‌ స్కీమ్‌ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్‌ 30 గడువు విధించారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం ఉండవన్నారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 


logo