శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 02:14:09

చివరి సంవత్సరం పరీక్షలే కీలకం: యూజీసీ

చివరి సంవత్సరం పరీక్షలే కీలకం: యూజీసీ

న్యూఢిల్లీ: విద్యార్థుల అకడమిక్‌ కెరీర్‌లో చివరి సంవత్సరం పరీక్షలే కీలకమని యూజీసీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ చివరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలంటూ జూలై 6న తాము జారీ చేసిన ఉత్తర్వులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనని పునరుద్ఘాటించింది. విద్యారంగ  నిపుణుల సూచనల మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపింది. మరోవైపు విద్యార్థుల ‘అకడమిక్‌ ప్రయోజనాల’ను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ పరీక్షలను నిర్వహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కి అనుమతినిచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది.


logo