శనివారం 16 జనవరి 2021
National - Dec 23, 2020 , 16:56:34

అక్క‌డ‌ 2021 జూన్‌లో వార్షిక ప‌రీక్ష‌లు

అక్క‌డ‌ 2021 జూన్‌లో వార్షిక ప‌రీక్ష‌లు

కోల్‌క‌తా: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో గ‌త విద్యా సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌రుగ‌లేదు. జాతీయ విద్యాసంస్థ‌ల‌తోపాటు, వివిధ రాష్ట్రాల్లో వార్షిక ప‌రీక్ష‌లు వాయిదాప‌డ్డాయి. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు ప‌లు రాష్ట్రాల్లో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి ఇంట‌ర్నల్ మార్కుల ఆధారంగా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. డిగ్రీ, పీజీ ఫైన‌ల్ ఇయ‌ర్ మిన‌హా మిగ‌తా విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేశారు. అయితే, ఫైన‌ల్ ఇయ‌ర్ పూర్త‌య్యే లోపు వారు అన్ని ప‌రీక్ష‌లు ఉత్తీర్ణులు కావాల్సిందేన‌ని నిబంధ‌న విధించారు. 

ఇదిలావుంటే, ఈసారైనా వార్షిక ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా జ‌రుగుతాయా లేదా..? అనే విష‌య‌లో నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమబెంగాల్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఏడాది జూన్‌లో టెన్త్‌, ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఉద‌యం ప‌శ్చిమబెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌, బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు స‌మావేశ‌మై 2021 జూన్‌లో వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ చ‌ట‌ర్జి తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.