గురువారం 02 జూలై 2020
National - Jun 22, 2020 , 18:38:21

మహాకుంభ మేళా నిర్వహణపై ఫిబ్రవరిలో నిర్ణయం.!

మహాకుంభ మేళా నిర్వహణపై ఫిబ్రవరిలో నిర్ణయం.!

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నిర్వహించనున్న మహాకుంభ మేళా-2021పై ఫిబ్రవరి నెలలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ తెలిపారు. కుంభమేళా నిర్వహణపై  నిర్ణయం తీసుకోవాలని అఖిల భారతీయ అకార పరిషత్‌ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని ఆయన పేర్కొన్నారు. కరోనాతో రోజురోజుకూ రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నందున ఇప్పట్లో కుంభమేళా నిర్వహణపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోగా దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అకార పరిషత్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ కుంభమేళాపై నిర్ణయం తీసుకోలేరని, కుంభమేళా నిర్వహణకు చేపట్టాల్సిన పనులను నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు. త్వరలో అఖిల భారత అకార పరిషత్‌తో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలకు అనుగుణంగా నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించారు. 


logo