ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 17:47:29

మ‌హా కుంభ‌మేళాపై ఫిబ్ర‌వ‌రిలో తుది నిర్ణ‌యం: ఉత్త‌రాఖండ్ సీఎం

మ‌హా కుంభ‌మేళాపై ఫిబ్ర‌వ‌రిలో తుది నిర్ణ‌యం: ఉత్త‌రాఖండ్ సీఎం

డెహ్రాడూన్‌: 2021లో జ‌రుగాల్సిన మ‌హా కుంభ‌మేళాపై వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నెల లోప‌లే తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని అఖిల భార‌తీయ ఆకార ప‌రిష‌ద్ ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వానికి సూచించింది. మహా కుంభ‌మేళా-2021పై చ‌ర్చించ‌డం కోసం ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ ఆదివారం సాయంత్రం అఖిల భారతీయ ఆకార ప‌రిష‌ద్ స‌భ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌రిష‌ద్ స‌భ్యులు 2021, ఫిబ్ర‌వ‌రి లోప‌లే కుంభ‌మేళాపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కుంభ‌మేళాపై నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ష్టం. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రోజురోజుకు ప‌రిస్థితులు మారుతున్నాయి. ప్ర‌స్తుతానికైతే కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ప‌నులు కొన‌సాగుతున్నాయి. కుంభ‌మేళాపై మాట్లాడ‌టానికి అఖిల భార‌తీయ ఆకార ప‌రిష‌ద్‌తో స‌మావేశ‌మ‌య్యాం. వారి స‌ల‌హా మేర‌కు వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలోపు కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌పై తుది నిర్ణ‌యం తీసుకోవాలని భావిస్తున్నాం అని ఉత్త‌రాఖండ్ సీఎం చెప్పారు.        logo