మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 16, 2020 , 17:19:58

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోండి: నుస్ర‌త్ జ‌హాన్

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోండి: నుస్ర‌త్ జ‌హాన్

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో చిత్ర ప‌రిశ్ర‌మ కుదేలైంద‌ని బెంగాల్ న‌టి, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్ర‌త్ జ‌హాన్ అన్నారు. బుధ‌వారం లోక్‌స‌భ‌లో మాట్లాడిన ఆమె.. దేశంలో చిత్ర ‌ప‌రిశ్ర‌మ భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ద‌ని చెప్పారు. బెంగాల్ చిత్ర‌ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి కూడా ప్ర‌స్తుతం అధ్వాన్నంగా ఉన్న‌ద‌ని నుస్ర‌త్ పేర్కొన్నారు. వేల మంది ఉపాధి లేక రోడ్డున ప‌డ్డార‌ని, ప్ర‌భుత్వం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను, ఆ ప‌రిశ్ర‌మపై ఆధార‌ప‌డిన వారిని ఆదుకోవడం కోసం ఉప‌శ‌మ‌న ప్యాకేజీలు ప్ర‌క‌టించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.                     ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo