శనివారం 23 జనవరి 2021
National - Dec 22, 2020 , 17:14:51

ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి : ఆదాయపుపన్నువిభాగం

  ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్  ఫైల్ చేయండి : ఆదాయపుపన్నువిభాగం

ఢిల్లీ : ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి టాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్  సమర్పిస్తుంటారు. అందులోభాగంగా నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 3.75కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపన్నురిటర్నులు దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆదాయపుపన్నువిభాగం మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇంకా సమర్పించనివారు కూడా దాఖలు చేసుకోవాలని ట్విటర్‌ వేదికగా సూచించింది.

''మీకు తెలుసా.. 2020-21 మదింపు సంవత్సరానికి(2019-20 ఆర్థిక సంవత్సరం)గానూ ఇప్పటికే 3.75కోట్ల మంది పన్నుచెల్లింపు దారులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. మీరు కూడా మీమీ రిటర్నులు సమర్పించారా? చేయకపోతే.. ఇప్పుడే చేయండి!'' అని ఆదాయపుపన్నువిభాగం ట్వీట్‌ చేసింది. డిసెంబరు 21 నాటికి 2.17కోట్ల మంది ఐటీఆర్‌-1, 79.82లక్షల మంది ఐటీఆర్‌-4, 43.18లక్షల మంది ఐటీఆర్‌-3, 26.56లక్షల మంది ఐటీఆర్‌-2 దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబరు 31వరకు గడువు ఉన్నది.

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఐటీ రిటర్నుల దాఖలకు కేంద్రం గడువు పొడగించింది. మొదట జులై 31వరకు గడవు ఉండగా.. దాన్ని అక్టోబరు 31 వరకు పెంచింది. ఆ తర్వాత డిసెంబరు 31వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. '2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్నుల దాఖలను డిసెంబరు 31వరకు పొడిగించారు. అదే విధంగా ఆడిటింగ్‌ చేసిన ఖాతాల ఆధారంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి చివరి తేదీని జనవరి 31,2021గా నిర్ణయించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ - ఆదాయపు పన్నుశాఖ (సీబీడీటీ)  పేర్కొన్నది. ఇవి కూడా చదవండి...  

 మెర్రీ క్రిస్మస్ కు "శారీ క్రిస్మస్ ట్రీ"...! 

స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి 


logo