సోమవారం 25 మే 2020
National - Apr 09, 2020 , 01:57:36

పోరుకు ‘భారీ బలగం’

పోరుకు ‘భారీ బలగం’

  • ఇప్పటికే పనిచేస్తున్నవారి స్థానంలో భర్తీ
  • సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆన్‌లైన్‌ శిక్షణ

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి ముప్పును మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నది. కరోనాపై పోరు కోసం భారీ బలగాన్ని సిద్ధంచేయాలని నిర్ణయించింది. కరోనా కట్టడి, వ్యాప్తి నియంత్రణ కోసం ముందువరుసలో ఉంటూ పనిచేస్తున్నవారి స్థానాన్ని ఈ భారీ బలగంతో భర్తీచేయాలని భావిస్తున్నది. పనిచేసేవారికి అవసరమైన ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నది.  ఐజీవోటీలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఏఎన్‌ఎంలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పౌర రక్షణ అధికారులు తదితరుల కోసం వివిధ కోర్సులను ప్రారంభించినట్టు కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ వెల్లడించింది.


logo