ఆదివారం 29 మార్చి 2020
National - Mar 26, 2020 , 12:36:14

ఫైట్ క‌రోనా ఐడియాథాన్ నిర్వ‌హిస్తున్న ఏఐసీటీఈ !

ఫైట్ క‌రోనా ఐడియాథాన్ నిర్వ‌హిస్తున్న ఏఐసీటీఈ !

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ), ఎంహెచ్‌ఆర్‌డి ఇన్నోవేషన్ సెల్‌తో  క‌ల‌సి క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే స‌రికొత్త ఆలోచ‌న‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతుంది. ఈ ఆన్‌లైన్ "ఫైట్ కరోనా ఐడిఇథాన్" ఈవెంట్ ద్వార ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు, ప‌రిష్కారాల‌ను సేక‌రించి వాటి ద్వార కోవిడ్‌-19 వ్యాప్తిని నివార‌ణ‌కు ఎఐసిటిఇ ప్ర‌య‌త్నిస్తుంది. ఈ ఈవెంట్‌ ఫోర్జ్ & ఇన్నోవేటికోరిస్ భాగస్వామ్యంతో నిర్వ‌హిస్తున్నారు. ఆన్‌లైన్‌లో  మార్చి 27, 28న‌ ఈ ఈవెంట్ జరుగుతుంది. దీనిలో స్టూడెంట్ ఇన్నోవేట‌ర్స్‌, రిసెర్చ‌ర్‌లు, అధ్యాపకులు పాల్గొన‌వ‌చ్చు. వీరంతా కోవిడ్‌-19 తో పోరాడటానికి సహాయపడే పరిష్కారాలను ఏవైనా ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాలి. పోటీలో ఎంపికైన వారికి ఫ్రైజ్ మ‌నీ కూడా అందిస్తారు.


logo