బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 19:41:38

కుక్కలు వర్సెస్‌ నీటికుక్కలు..వీడియో చక్కర్లు

కుక్కలు వర్సెస్‌ నీటికుక్కలు..వీడియో చక్కర్లు

సాధారణంగా కుక్కలు వివిధ రకాల జంతువులతో హోరాహోరీగా పోటీ పడటం చూసుంటారు. కానీ నీటికుక్కలు (ఒట్టర్లు)తో  తగువులాడటం చూశారా..? తాజాగా ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నీటిలో ఉన్న ఒక నీటికుక్కను 4 కుక్కలు వచ్చి బెదిరించేందుకు ప్రయత్నించాయి.  కుక్కల్ని చూసిన మరో రెండు నీటికుక్కలు  తమ సహచరిని కాపాడేందుకు వేగంగా పరుగెత్తుకొచ్చాయి. ఓ వైపు 4 కుక్కలు, మరో వైపు 3 నీటికుక్కలు హోరాహోరీగా నువ్వా..నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీలో ఏ జంతువుకు ఎలాంటి హాని జరుగలేదు. ఆ తర్వాత రెండూ వేటి దారిన అవి వెళ్లిపోయాయి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo