మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 16:26:28

విద్యార్థుల కోసం 51 ఎడ్యుకేష‌న్ ఛానెళ్లు

విద్యార్థుల కోసం 51 ఎడ్యుకేష‌న్ ఛానెళ్లు

ఢిల్లీ : విద్యార్థుల సౌక‌ర్యార్థం 51 డైరెక్ట్ టు హోం(డీటీహెచ్‌) ఎడ్యూకేష‌న్ టీవీ ఛానెల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్ర‌సారాల‌ను అందించేందుకు ప్ర‌సార భార‌తీ, భాస్క‌రాచార్య నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ స్పేస్ అప్లికేష‌న్స్ అండ్ జియో ఇన్‌ఫ‌ర్మెటిక్స్‌, మినిస్ర్టీ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీ(ఎంఈఐటీవై) నేడు సంయుక్త ఒప్పందంపై సంతకాలు చేశాయి. నూత‌న‌ 51 డీటీహెచ్ ఎడ్యుకేషన్ టీవీ ఛానెల్స్ అన్ని డీడీ కో బ్రాండెడ్ ఛాన‌ళ్ల‌లో ఉచితంగా ప్ర‌సారం కానున్నాయి. నాణ్య‌మైన విద్య‌నందించ‌డంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల‌కు ల‌బ్ది చేకూర్చేందుకు ఈ ఎడ్యూకేష‌న్ ఛానెళ్ల‌ను తీసుకువ‌స్తున్న‌ట్లుగా ప్ర‌సార భార‌తి పేర్కొంది. ప్ర‌సారాలు 24x7 వీక్షకులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయంది.