గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 08, 2020 , 02:30:43

నలిగిన బతుకులు

నలిగిన బతుకులు

  • కేరళలో కొండచరియ విరిగిపడి 15 మంది మృతి
  • ఇంకా 50 మంది శిథిలాల కిందనే! 

ఇడుక్కి (కేరళ), ఆగస్టు 7: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల వల్ల కొండచరియ విరిగిపడటంతో 15 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులున్నారు. ఈ దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడి ప్రాంతంలో చోటుచేసుకుంది. వర్షాలకు బాగా తడిచిన కొండచరియ ఒక్కసారిగా కుప్పకూలి కిందనే ఉన్న ఇండ్లపై పడిపోయింది. దీంతో ఇండ్లలో ఉన్న వాళ్లు ఆ మట్టిదిబ్బల కింద కూరుకుపోయారు. వారిలో 15 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు 15 మందిని కాపాడారు. మట్టిదిబ్బల కింద ఇంకా దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు వారిని కాపాడటానికి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా మృతిచెందిన వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన కార్మికులని అధికారులు చెప్పారు.


logo