శుక్రవారం 03 జూలై 2020
National - May 25, 2020 , 10:32:09

విమానాలు ర‌ద్దు.. అయోమ‌యంలో ప్ర‌యాణికులు

విమానాలు ర‌ద్దు.. అయోమ‌యంలో ప్ర‌యాణికులు

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని విమానాశ్ర‌యాల నుంచి దేశీయ విమాన స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని చోట్ల ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేశారు.  దీంతో ప్ర‌యాణికులు తీవ్ర అయోమ‌యానిలోన‌వుతున్నారు.  టికెట్ బుకింగ్ చేసుకుని ఎయిర్‌పోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఫ్ల‌యిట్లు ర‌ద్దు అయిన‌ట్లు వారికి స‌మాచారం ఇస్తున్నారు.  దీంతో ఆ ప్ర‌యాణికులు ఏం చేయాలో అర్థంకాక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముంబై విమానాశ్ర‌యం నుంచి పాట్నా వెళ్ల‌వ‌లిసిన విమానాన్ని ఇవాళ ర‌ద్దు చేశారు. ఉద‌యం ప్రారంభం కావాల్సిన ఆ ఫ్ల‌యిట్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చిన వారంతా షాక‌య్యారు.

బెంగుళూరులో కూడా ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తింది. బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు రావాల్సిన విమానాన్ని అక‌స్మాత్తుగా ర‌ద్దు చేశారు.  ఎయిర్‌లైన్స్ నుంచి త‌మ‌కు ఎటువంటి స‌మాచారం లేద‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  బోర్డింగ్ పాస్‌ల‌ను స్కానింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌మ విమానం ర‌ద్దు అయిన‌ట్లు సిబ్బంది తెలియ‌జేశార‌ని ఓ ప్ర‌యాణికుడు ఆరోపించాడు.  ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇవాళ 80 ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేశారు. దాంట్లో డిపార్చ‌ర్స్ , అరైవ‌ల్స్ ఉన్నాయి. ముంబై విమానాశ్ర‌యంలో 25 టేకాఫ్‌లు, 25 ల్యాండిగ్స్‌కు అనుమ‌తి ఉన్న‌ది. చెన్నైలో 25 ఫ్ల‌యిట్ల‌కు మాత్ర‌మే అరైవ‌ల్ అనుమ‌తి ఉన్న‌ది.


logo