గురువారం 04 జూన్ 2020
National - May 10, 2020 , 16:19:02

పేదల‌కు రేష‌న్ పంచిన టీచ‌ర్ క‌రోనాతో మ‌ర‌ణించింది

పేదల‌కు రేష‌న్ పంచిన టీచ‌ర్ క‌రోనాతో మ‌ర‌ణించింది

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ ఉపాధ్యాయురాలు క‌రోనా సోకి మ‌ర‌ణించింది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలైన ఆమెను అధికారులు డిప్యుటేష‌న్‌పై పేద‌ల‌కు స‌రుకులు పంపిణీ చేసే ప‌నిలో నియ‌మించారు. నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏరియాలో ఆమె రేష‌న్ డిస్ట్రిబ్యూష‌న్ విధుల్లో పాల్గొన్న‌ది. అనంత‌రం క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రి పాలైన ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు వెల్ల‌డించారు. కాగా, ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 6, 923 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. వారిలో 73 మంది మ‌ర‌ణించారు.  


logo