మంగళవారం 07 జూలై 2020
National - Apr 04, 2020 , 15:34:27

భారీ విందు.. కుటుంబంలో 12 మందికి కరోనా

భారీ విందు.. కుటుంబంలో 12 మందికి కరోనా

హైదరాబాద్: కరోనా తరుముకొని వస్తున్నది. గుంపులుగుంపులుగా కలవొద్దు.. దూరం పాటించండి.. అని సర్కారు ఎంత మొత్తుకున్నా కొంతమంది మా రూటే సెపరేటు అన్నట్టుగా పోతున్నారు. కరోనా కాటుకు గురవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని మొరేనాలో అలాంటి ఘటనే జరిగింది. సురేశ్ అనే వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్‌గా పనిచేస్తాడు. తన తల్లి చనిపోయిందని మార్చి 17న అతడు మొరేనాకు వచ్చాడు. మార్చి 20న తన తల్లి దినం నాడు 1500 మంది అతిథులతో విందు ఏర్పాటు చేశాడు. ముప్పు ముంచుకు వస్తున్న ఈ తరుణంలో నిరాండంబరంగా జరపాల్సిందిపోయి అంతమందిని పిలిచి భోజనాలు పెట్టించాడు. మార్చి 25న అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ నాలుగు రోజులు ఆలస్యంగా దవాఖానాకు వెళ్ళాడు. అతడిని, అతని భార్యను క్వారంటైన్‌లో పెట్టారు. గురువారం ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. తర్వాత్త అతని సమీప బంధువులను 23 మందిని వైద్యులు పరీక్షించారు. వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చినవారిని కూడా మొరేనా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉంచారు. సురేశ్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని దిగ్బంధించారు.


logo