మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 18:47:39

డిజిటల్ మీడియాలో ఎఫ్.డీ.ఐ లు అమలు చేయండి: ఐ అండ్ బీ మినిస్ట్రీ

డిజిటల్ మీడియాలో ఎఫ్.డీ.ఐ లు అమలు చేయండి: ఐ అండ్ బీ మినిస్ట్రీ

ఢిల్లీ :డిజిటల్ మీడియా ద్వారా వార్తలు, ప్రస్తుత వ్యవహారాలను అప్‌లోడ్, స్ట్రీమింగ్‌లో పాల్గొనడానికి అర్హత ఉన్నసంస్థలకు ప్రభుత్వం అనుమతించిన విధానం కింద 26 శాతం ఎఫ్.డీ.ఐ. లను అనుమతిస్తూ 2019 సెప్టెంబర్, 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నిఅమలుచేయడానికి వీలుగా, కేంద్ర సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒక నెల లోపు అమలు చేయాలని కోరుతూ అర్హత కలిగిన సంస్థలు చేపట్టాల్సిన చర్యలను మంత్రిత్వ శాఖ తెలిపింది. 

- 26 శాతం కంటే తక్కువ విదేశీ పెట్టుబడులున్న సంస్థలు ఈ రోజు నుం చి ఒక నెల లోపు, కింద పేర్కొన్న అంశాలను పొందుపరుస్తూ - కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు తెలియజేయవచ్చు.

- కంపెనీ, సంస్థ వివరాలు దాని వాటాల నమూనాతో పాటు దాని డైరెక్టర్లు, వాటాదారుల పేర్లు , చిరునామాల వివరాలు.  -ప్రమోటర్లు,ముఖ్యమైన యజమానుల పేర్లు ,చిరునామాలు. 

-ఎఫ్.డి.ఐ. విధానం, విదేశీ మారకం నిర్వహణ (నాన్-డెట్ ఇన్స్ట్రుమెంట్స్) నిబంధనలు, 2019 విదేశీ మారకం నిర్వహణ (నాన్-డెట్ ఇన్స్ట్రుమెంట్స్ చెల్లింపు రిపోర్టింగ్) నిబంధనలు, 2019, క్రింద ధర, డాక్యుమెంటేషన్ రిపోర్టింగ్ అవసరాలకు అనుగుణంగా ఒక ధృవీకరణ పత్రం (గత / ఇప్పటికే ఉన్న విదేశీ పెట్టుబడులు ఏమైనా ఉంటే, వాటి మద్దతుగా సంబంధిత ధ్రువపత్రాల కాపీలతో పాటు) 

-ఆడిటర్ నివేదికతో పాటు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) తాజాగా ఆడిట్ చేసిన ,ఆడిట్ చేయని లాభ, నష్టాల (పి అండ్ ఎల్) పట్టిక, బ్యాలెన్స్ షీట్.  

-  ప్రస్తుతం, 26 శాతానికి మించి విదేశీ పెట్టుబడులతో ఈక్విటీ నిర్మాణాన్నికలిగి ఉన్న సంస్థలు , వివరాలతో పాటు, 2021 అక్టోబర్, 15వ తేదీ నాటికి, విదేశీ పెట్టుబడులను 26 శాతానికి తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను, ఈ రోజు నుం చి ఒక నెలలోపు,   సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలి.  - దేశంలో కొత్తగా విదేశీ పెట్టుబడులను తీసుకురావాలని అనుకునే ఏదైనా సంస్థ డి.పి.ఐ.ఐ.టి. విదేశీ పెట్టుబడుల సౌకర్య పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పొందాలి.

గమనిక:- పెట్టుబడులు అంటే భారతదేశంలో నివసించే వ్యక్తి చేత చందా పొందడం, సేకరించడం లేదా బదిలీ చేయడం.     

- ప్రతి సంస్థ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పౌరసత్వం  అవసరాలకు అనుగుణంగా ఉండాలి. నియామకం, కాంట్రాక్ట్ లేదా కన్సల్టెన్సీ లేదా సంస్థ  

పనితీరు కోసం ఇతర సామర్ధ్యాల ద్వారా సంవత్సరంలో 60 రోజులకు పైగా నియమించుకునే అవకాశం ఉన్న విదేశీ సిబ్బందికి, వారిని నియమించుకోడానికి ముందే తగిన భద్రతా అనుమతులు తీసుకోవాలి. ఇందు కోసం, ఆయా సంస్థలు, విదేశీ సిబ్బందిని నియమించుకోడానికి కనీసం 60 రోజుల ముందుగానే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని, ముందస్తు అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రతిపాదిత విదేశీ సిబ్బందిని నియమించాలి.వివో సరికొత్త బడ్జెట్ ఫోన్... ఫీచర్స్ సూపర్...

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.