గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 21:53:33

ఫావిపిరవిర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఆమోదం

ఫావిపిరవిర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఆమోదం

న్యూఢిల్లీ: కరోనా వ్యాధిగ్రస్థులకు ఫావిపిరవిర్‌ ఔషధాన్ని ప్రయోగించేందుకు డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫ్‌  ఇండియా అనుమతించింది. ఈ  ఔషధం  తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఙానాన్ని హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాటజీ (ఐఐసీటీ) అభివృద్ధి  చేసింది. ఔషధాన్ని రోగులపై ప్రయోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లభించిందని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌  శేఖర్‌ మండే తెలిపారు. ఇక ట్రయల్స్‌ కోసం  దవాఖానలతో సంబంధిత కంపెనీ ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. కరోనా రోగులు కోలుకోవడానికి ఫావిపిరవిర్‌ ఔషధాన్ని ఇప్పటికే చైనా, జపాన్‌లాంటి దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఒకసారి వైరస్‌ మానవుడి కణాల్లోకి ప్రవేశించాక అది ప్రతిరూపాలను సృష్టిస్తుందని, అయితే ఫావిపిరవిర్‌ను ఉపయోగించడం వల్ల ఈ నకళ్ల సృష్టికి  అడ్డుకట్టపడుతుందని వెల్లడించారు.


logo