బుధవారం 02 డిసెంబర్ 2020
National - Sep 11, 2020 , 19:10:09

కూతురి కోసం గ్యారేజ్‌ను క్లాస్‌రూంగా మార్చిన తండ్రి.. టీచ‌ర్ పాఠాలు భ‌లే చెప్తుంది

కూతురి కోసం గ్యారేజ్‌ను క్లాస్‌రూంగా మార్చిన తండ్రి.. టీచ‌ర్ పాఠాలు భ‌లే  చెప్తుంది

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇరుగుపొరుగు వారు మాట్లాడుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు. ఏం మాట్లాడాల‌న్నా అంతా ఇంట‌ర్నెట్‌తోనే. జూమ్‌, గూగుల్ మీట్‌, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, వాట్సాప్ వంటి వాటితోనే వీడియో కాల్ మాట్లాడుతున్నారు. క‌రోనా కార‌ణంగా వ్యాపారాలు దెబ్బ‌తిన‌డంతోపాటు పిల్ల‌ల చ‌దువుకు భంగం క‌లిగింది. దీన్ని అలానే వ‌దిలేయ‌కుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు ఉపాధ్యాయులు. అందుకు కావాల్సిన స్మార్ట్‌ఫోన్‌, నెట‌వ‌ర్క్ అన్ని ఏర్పాట్లు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు చేస్తున్నారు. కొంత‌మంది అయితే పెంచుకుంటున్న గేదె, ఆవుల‌ను అమ్మేసి మ‌రీ పిల్ల‌ల‌కు ఫోన్లు కొనిచ్చారు. ఇదంతా పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోస‌మే క‌దా.

ఈ విధంగా ఓ తండ్రి కుమార్తె కోసం త‌న గ్యారేజీని క్లాస్ రూంగా మార్చారు. క్లాస్ రూం ఏ విధంగా అయితే ఉంటుంటో అచ్చం అలానే తీర్చిదిద్దాడు. త‌ర‌గ‌తి గ‌దిలో టీచ‌ర్ పాఠాలు చెప్తుంది అనే ఫీలింగ్ రావ‌డం కోసం ఒక లేడీ క‌టౌట్ పెట్టి ముఖం ప్ర‌దేశంలో టాబ్‌‌ను అమ‌ర్చాడు తండ్రి. టీచ‌ర్‌కు ఎదురుగా ఒక టేబుల్. దాని మీద పాప కూర్చొని పాఠం వింటున్న‌ట్లుగా వీడియోలో క‌నిపిస్తుంది. లిల్లియ‌న్స్ గ్యారేజ్ నుంచి లిల్లియ‌న్స్ క్లాస్‌రూంగా అవ‌తార‌మెత్తింది. పాప కోసం తండ్రి చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోను రెడ్డిట్‌లో పోస్ట్ చేయ‌గా 90 వేల‌కు పైగా వీక్షించారు. 

Father converted his garage into a classroom for his daughter from r/nextfuckinglevel