బుధవారం 08 జూలై 2020
National - May 28, 2020 , 17:31:39

రెండు నెలల పాపపై తండ్రి అత్యాచార యత్నం

రెండు నెలల పాపపై తండ్రి అత్యాచార యత్నం

ఈరోడ్‌: రెండు నెలల పాప, తన సొంత కూతురు అని కూడా చూడకుండా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు ఓ కామాంధుడు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన రెండు నెలల పాపపై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన 48 ఏళ్ళ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన ఈరోడ్‌ జిల్లాలోని భవానీ తాలూకా మాధూర్‌ గ్రామంలో జరిగింది. 

పాప నిద్రిస్తున్న సమయంలో తల్లి ఇతర పనుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాపను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాడు. పాప ఏడుపులు గమనించిన తల్లి అతను పాపను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించింది. అనంతరం పాపను తల్లి ఆసుపత్రికి తరలించి వైద్యులకు చూపించింది. అనంతరం స్థానిక పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది ఆ మహిళ. దీంతో వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి 15 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు పోలీసులు.


logo