మంగళవారం 31 మార్చి 2020
National - Feb 13, 2020 , 02:28:43

కొడుకు ఎమ్మెల్యే.. తండ్రి పని టైర్లు పంక్చర్‌ !

కొడుకు ఎమ్మెల్యే.. తండ్రి పని టైర్లు పంక్చర్‌ !

భోపాల్‌, ఫిబ్రవరి 12: కుమారులు ఎంత ప్రయోజకులైనప్పటికీ తాను మాత్రం టైర్లు పంక్చర్‌ చేసే వృత్తిని కొనసాగిస్తున్నాడు ఓ తండ్రి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన పీఎన్‌ దేశ్‌ముఖ్‌కు ఇద్దరు కుమారులు ఉండగా.. వారిలో ఒకరైన ప్రవీణ్‌కుమార్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరఫున వరుసగా రెండుసార్లు గెలిచారు. మరొక కుమారుడైన లోకేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయినా దేశ్‌ముఖ్‌ మాత్రం రోజూ భోపాల్‌లోని బోగ్డాపూల్‌ ప్రాంతంలో రోడ్డు వెంట ఉన్న తన టైర్‌ పంక్చర్‌ దుకాణానికి వెళ్లి పనిచేస్తున్నారు. దీనిపై దేశ్‌ముఖ్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ రోజు నా కుటుంబం నిలదొక్కుకోవడానికి, నా కుమారులు ప్రయోజకులు కావడానికి నా వృత్తే కారణం. అలాంటి వృత్తిని ఎలా వదులుకుంటాను’ అని పేర్కొన్నారు.


logo
>>>>>>