శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 15:10:44

తండ్రీ కొడుకుల డ్యాన్స్ పెర్ఫామెన్స్‌.. వీరిలో తండ్రెవ‌రో, కొడుకెవ‌రో గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా?

తండ్రీ కొడుకుల డ్యాన్స్ పెర్ఫామెన్స్‌.. వీరిలో తండ్రెవ‌రో, కొడుకెవ‌రో గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా?

ఒక కార్య‌క్ర‌మంలో ఏక్ పాల్ కా జీనా అనే బాలీవుడ్ సాంగ్‌కి తండ్రీ, కొడుకులిద్ద‌రూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. హృతిక్ రోష‌న్ అభిమానుల‌కు ఈ వీడియో త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. అంత‌లా పెర్ఫామెన్స్ ఇచ్చారు. రోష‌న్ ప్ర‌కాస్ అనే ట్విట‌ర్ యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేశారు. అంతేకాదు బాలీవుడ్ ప్ర‌ముఖ హీరో హృతిక్ రోష‌న్ త‌ప్ప‌కుండా చూడాలంటూ అత‌నికి ట్యాగ్ చేశారు.

59 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో హృతిక్ రోష‌న్ తొలిచిత్రం క‌హో నా.. ప్యార్ హై అనే చిత్రంలోని ఏక్ పాల్ కా జీనాకు స్టెప్పులేశారు. తండ్రీ, కొడుకులిద్ద‌రూ ఉత్సాహ‌భ‌రితంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ వీడియోకు 1900ల‌కు పైగా లైకులు, అనేక రీట్వీట్ల‌ను సొంతం చేసుకున్న‌ది. "ఓహ్ మై గాడ్. సూపర్ కొడుకు సూపర్ ఫాదర్" అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo