మంగళవారం 31 మార్చి 2020
National - Feb 19, 2020 , 00:42:32

గ్రే లిస్ట్‌లో పాక్‌!

గ్రే లిస్ట్‌లో పాక్‌!
  • ఎఫ్‌ఏటీఎఫ్‌ ఉపసంఘం సిఫార్సు
  • ఈ నెల 21న తుది నిర్ణయం

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైన పాకిస్థాన్‌ను ‘గ్రే’ జాబితాలోనే కొనసాగించాలని అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల నిరోధక సంస్థ ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌-ఎఫ్‌ఏటీఎఫ్‌'కు చెందిన ఒక ఉపసంఘం సిఫార్సు చేసింది. దీనిపై ఎఫ్‌ఏటీఎప్‌ శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పారిస్‌లో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశాల సందర్భంగా మంగళవారం జరిగిన ‘ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ రివ్యూ గ్రూప్‌' (ఐఆర్‌సీజీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పాక్‌ గ్రే జాబితా నుంచి వైట్‌ జాబితాలోకి రావాలంటే ఎఫ్‌ఏటీఏలోని 39 దేశాల్లో 12 దేశాలు మద్దతివ్వాలి. బ్లాక్‌ లిస్ట్‌లో చేరకుండా ఉండాలంటే కనీసం మూడు దేశాల మద్దతు అవసరం. గతేడాది చైనా, మలేషియా, టర్కీ మద్దతివ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లో చేరే ప్రమాదం నుంచి పాక్‌ గట్టెక్కింది.


logo
>>>>>>