శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 02:40:09

అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి

అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి

న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్‌ పద్దతిలో టోల్‌ ఫీజు చెల్లింపును మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పాత వాహనాలతోపాటు అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాల యజమానులు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీహెచ్‌) శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్‌ పునరుద్దరించిన తర్వాతే ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది.