బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 20:58:51

కరోనా కట్టడికి ఫ్యాషన్ డిజైనర్ భారీ విరాళం..

కరోనా కట్టడికి ఫ్యాషన్ డిజైనర్ భారీ విరాళం..

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని తరిమేందుకు తమ వంతు సాయమందించేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కోవిడ్ -19తో సమస్యలు ఎదుర్కొంటున్న చిరువ్యాపారులు, స్వయం ఉపాధి పొందే చేతివృత్తిదారుల కోసం వైద్యనిధి కింద రూ.1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రె వెల్లడించారు.

కరోనా నియంత్రణలో భాగంగా ప్రకటించిన లాక్ డౌన్  చిరు వ్యాపారులపై పెను ప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారితో పెరిగే వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ఫౌండేషన్ ముందుకొస్తుందని అనితా డోంగ్రె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పేదలు, చిరువ్యాపారులు, చేతివృత్తిదారులు కరోనా బారిన పడితే వారి వైద్య అవసరాల కోసం తమ ఫౌండేషన్ రూ.1.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తమ ఉద్యోగులందరికి వైద్య బీమా ఉందని, ఎమర్ఝెన్సీ తలెత్తితే వైద్య నిధి ఫండ్స్ ను వారి కోసం వెచ్చిస్తామని అనితా డోంగ్రే పేర్కొన్నారు. logo