సోమవారం 30 మార్చి 2020
National - Mar 13, 2020 , 14:08:34

గృహ‌నిర్బంధం నుంచి ఫారూక్ అబ్దుల్లాకు విముక్తి..

గృహ‌నిర్బంధం నుంచి ఫారూక్ అబ్దుల్లాకు విముక్తి..

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఆయ‌న్ను గృహ‌నిర్భంధంలో ఉంచిన విష‌యం తెలిసిందే. గృహ‌నిర్బంధం ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తూ ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు రిలీజ్ చేసింది. క‌శ్మీర్‌లో గ‌త ఏడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి చెంద‌ని ప‌లువురు నేత‌ల్ని అరెస్టు చేశారు. అయితే సుమారు ఏడు నెల‌ల నిర్బంధం త‌ర్వాత ఫారూక్ అబ్దుల్లాను విడుద‌ల చేయ‌నున్నారు. ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్ర‌కారం ఆయ‌న్ను అరెస్టు చేశారు.  83 ఏళ్ల ఫారూక్‌తో పాటు ఆయ‌న కుమారుడు ఒమ‌ర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీల‌ను కూడా నిర్భ‌ధించారు.  గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఒమ‌ర్ అబ్ధుల్లాపై పీఎస్ఏను ప్ర‌యోగించారు.  ఆ చ‌ట్టం ప్రకారం ఎటువంటి విచార‌ణ లేకుండా రెండేళ్లు నిర్బంధంలో ఉంచ‌వ‌చ్చు. ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ను అరెస్టు చేశారు.   సాధార‌ణంగా పీఎస్ఏ చ‌ట్టాన్ని ఉగ్ర‌వాదులు, వేర్పాటువాదులు, రాళ్లు రువ్వే అల్ల‌రి మూక‌ల‌పై ప్ర‌యోగిస్తారు. కానీ తొలిసారి కేంద్ర ప్ర‌భుత్వం ప‌లువురు ప్ర‌ధాన రాజ‌కీయ నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్న‌ది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఫారూక్ డిటెన్ష‌న్‌ను మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగించారు. 


logo