మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 23:52:12

కరోనా కట్టడికి ఫరూఖ్‌ అబ్దుల్లా రూ.కోటి విడుదల

కరోనా కట్టడికి  ఫరూఖ్‌ అబ్దుల్లా రూ.కోటి విడుదల

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో కరోనా నియంత్రణకు మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా రూ.కోటి నిధులిచ్చారు. శ్రీనగర్‌ ఎంపీ అయిన ఆయన ఎంపీలాడ్‌ నిధుల నుంచి వీటిని విడుదల చేసినట్లు ఆ పార్టీ శనివారం తెలిపింది. ఫరూఖ్‌ సూచన మేరకు పార్టీ నేత, అనంతనాగ్‌ ఎంపీ  హస్నైన్‌ మసూది కూడా ఎంపీలాడ్‌ నిధుల నుంచి రూ.కోటి విడుదల చేసినట్లు పేర్కొంది. 


logo
>>>>>>