బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 01:16:24

కుమారుడిని కలిసిన ఫరూక్‌ అబ్దుల్లా

కుమారుడిని కలిసిన ఫరూక్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌: గృహ నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను ఆయన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా శనివారం కలిశారు. గంటపాటు పలు విషయాలపై చర్చించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటి నుంచి  గృహ నిర్బంధంలో ఉన్న ఫరూక్‌ అబ్దుల్లాను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఫరూక్‌ తన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా నిర్బంధంలో ఉన్న ఇంటికి వెళ్లి పరామర్శించారు. 


logo