బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 14:47:01

జైల్లో ఒమ‌ర్‌ను క‌లిసిన ఫారూక్ అబ్దుల్లా

జైల్లో ఒమ‌ర్‌ను క‌లిసిన ఫారూక్ అబ్దుల్లా

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా.. ఇవాళ త‌న కుమారుడు ఒమ‌ర్ అబ్దుల్లాను శ్రీన‌గ‌ర్ జైలులో క‌లిశారు.  క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత ఆ రాష్ట్రానికి చెందిన కొంద‌రు నేత‌ల్ని అరెస్టు చేశారు. ఏడు నెల‌ల నిర్బంధం త‌ర్వాత ఫారూక్ శుక్ర‌వార‌మే రిలీజ్ అయ్యారు.  ఒమ‌ర్ కూడా ఏడు నెల‌ల క్రిత‌మే అరెస్టు అయ్యారు.  శ్రీన‌గ‌ర్‌లోని హ‌రినివాస్ నుంచి ఫారూక్ .. జైలుకు నేరుగా వెళ్లారు.  ఏడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత క‌లిసిన ఇద్ద‌రూ ఒక‌ర్ని ఒక‌రు హ‌గ్ చేసుకున్నారు.  అంత‌క‌ముందు దాల్ స‌ర‌స్సు స‌మీపంలో ఉన్న మాజీ సీఎం షేక్ అబ్దుల్లా స‌మాధిని కూడా ఫారూక్ అబ్దుల్లా విజిట్ చేశారు.  


logo