e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News దేశ‌వ్యాప్త బీజేపీ శాస‌న‌స‌భ్యుల ఇండ్ల వెలుప‌ల రేపు రైతుల నిర‌స‌న‌

దేశ‌వ్యాప్త బీజేపీ శాస‌న‌స‌భ్యుల ఇండ్ల వెలుప‌ల రేపు రైతుల నిర‌స‌న‌

దేశ‌వ్యాప్త బీజేపీ శాస‌న‌స‌భ్యుల ఇండ్ల వెలుప‌ల రేపు రైతుల నిర‌స‌న‌

ఘ‌జియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శ‌నివారం) రైతులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం ఈ పిలుపునిచ్చింది. ఈ చ‌ట్టాల‌ను కేంద్రం ఆర్డినెన్స్‌లుగా ప్ర‌క‌టించి ఏడాది గ‌డుస్తున్న సంద‌ర్భంగా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు బీకేయూ ఆఫీస్ బేర‌ర్ తెలిపారు.

ఎక్క‌డైతే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని చోట రైతులు జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు అదేవిధంగా సంబంధిత చ‌ట్టాల కాపీల‌ను కాల్చివేయ‌నున్న‌ట్లు బీకేయూ మీడియా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర మాలిక్ చెప్పారు. రైతు సంఘాల నాయ‌కుల ఇటీవ‌ల స‌మావేశంలో జూన్ 5 నిర‌స‌న కార్య‌క్ర‌మానికి నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు న‌వంబ‌ర్ 2020 నుంచి ఆందోన‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశ‌వ్యాప్త బీజేపీ శాస‌న‌స‌భ్యుల ఇండ్ల వెలుప‌ల రేపు రైతుల నిర‌స‌న‌

ట్రెండింగ్‌

Advertisement