ఆదివారం 24 జనవరి 2021
National - Dec 02, 2020 , 11:33:23

కేంద్రంతో రేపు మరోసారి రైతుల చర్చలు

కేంద్రంతో రేపు మరోసారి రైతుల చర్చలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. మంగళవారం జరిగిన చర్చలు ఫలపద్రం కాకపోవడంతో గురువారం మరోసారి సమాశమయ్యేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. చర్చల సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు ‘ఇప్పుడు కమిటీల ఏర్పాటు చేయడానికి సమయం లేదు’ అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఎక్కువ మంది సభ్యులుంటే ఏకాభిప్రాయం రావడం కష్టమని, ఐదారుగురు నేతలు కమిటీగా రావాలని సూచించారు.


ఏ చర్చకైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. నాలుగో రౌండ్‌ చర్చలు గురువారం జరుగుతాయని పేర్కొన్నారు. చర్చల్లో ఆందోళన చేస్తున్న 32 సంఘాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, తోమర్‌తో పాటు రైల్వే శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌, పరిశ్రమల సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కూడిన ప్యానెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాగా.. యూనియన్ల నేతలు ప్రతిపాదనను తిరస్కరించారు. మరో వైపు రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ-ఖాజీపూర్‌ (ఢిల్లీ-యూపీ సరిహద్దు)లో రైతులకు అధికారులు భోజనం అందిస్తున్నారు.


logo